ప్రజాశక్తి- రాయచోటి : వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఆరు సూత్రాల కార్యక్రమం అమలు చేస్తామని కాంగ్రెస్ మీడియా చైర్మన్ డాక్టర్ తులసి రెడ్డి అన్నారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రానికి ఒక శని గ్రహంలా బిజెపి, రాహుకేతువులుగా వైసిపి టిడిపి దాపురించాయని పేర్కొన్నారు. సీమాంధ్ర స్వర్ణాంధ్ర అవుతుందని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాల వల్ల గిట్టుబాటు కావడం లేదని, రైతులు అప్పుల ఊబిలో కూరుకు పోయారని పేర్కొన్నారు. అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రైతుల ఆత్మహత్యల్లో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉందని విమర్శించారు. రైతులను అప్పుల ఊబి నుండి బయటకు తెచ్చేందుకు వ్యవసాయ రుణాలు మాఫీ, రూ. 500 లకు గ్యాస్ సిలిండరు, ప్రతి నిరుపేద కుటుంబానికీ రూ. 6 వేలు, రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాయలసీమలో, ఉత్తరాంధ్రలో, బుందేల్‌ఖండ్ తరహా అభివద్ధి చేస్తామన్నారు. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్. దుర్గారావు పట్టణంలో ఓడరేవు, పోలవరం ప్రాజెక్టు, విశాఖ మెట్రో జోన్, విజయవాడ మెట్రో, విశాఖ రైల్వే జోన్ సమస్యలను కాంగ్రెస్ పార్టీ పరిష్కరిస్తుంది అన్నారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి అల్లాబకాష్, ఖాదర్‌బాషా, చెన్న కష్ణ, మహబూబ్‌బాషా, రమణమ్మ, ఎస్ ఎండి గౌస్, ఖాదర్ ఖాన్, జాఫర్, షఫీ, పాల్గొన్నారు.










