సంబేపల్లి: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోతుందని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జి మాజీ ఎమ్మెల్యే ఆర్.రమేష్ కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం ప్రకాష్ నగర్ కాలనీ పంచాయతీలో ప్రకాష్‌నగర్ రోడ్డు, వారేపల్లి, గొల్లపల్లె, రేగడిగొఉటపల్లె, నగరి గుండ్రేవారిపల్లెల్లో రాష్ట్రానికి ఇదేమి ఖర్మ, రచ్చబండ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ శ్రేణులతో నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎస్‌సి, ఎస్‌టి, బిసి సబ్‌ప్లాన్ నిధులను నవరత్నాల పేరిట దారి మళ్లించడంతో వెనుకబడిన కులాలకు తీరని అన్యాయం జరుగుతోందని చెప్పారు. రాష్ట్రంలో అభివద్ధి కార్యక్రమాలు నిలిచి పోయాయన్నారు. కనీసం రోడ్ల మరమ్మతు కూడా లేక అన్ని రంగాలకు కష్టాలు పెరిగాయన్నారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో అప్పుల పాలు అయిందన్నారు. మరో పదేళ్లు గడిచినా కోలుకోలేని పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు రద్దు అనుభవానికి వీలుకాని ఇళ్ల స్థలాల పంపిణీ మట్టి ఇసుక దోపిడీల దందాలతో సామాన్య ప్రజల జీవితాల్లో అల్లకల్లోలంగా మార్చారని విమర్శించారు. భూ కబ్జాలు భారీగా పెరిగిపోయే అన్నారు. ముస్లిం, మైనార్టీలకు కల్లబొల్లి మాటలు చెప్పి ఓట్లు దండుకున్న నాయకులు వారి సంక్షేమం మరిచారన్నారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు చిన్న రెడ్డయ్య యాదవ్ ,క్లస్టర్ ఇన్‌ఛార్జి విష్ణువర్ధన్ రెడ్డి, శశిధర్ రెడ్డి, గోపీనాథ్ రెడ్డి, గ్రామ అధ్యక్షులు తోక వెంకటరమణ, మండల మైనార్టీ నాయకుడు అబ్దుల్ మునా ఫ్, సుబ్బరాజు యాదవ్, కోళ్ల ఫారం సుబ్బారెడ్డి, మాజీ సర్పంచులు వెంకటయ్య, సిద్ధారెడ్డి, మాజీ ఎంపిటిసి భాస్కర నూరు ఎకరాల రంగారెడ్డి మహదేవ్ పల్లె ప్రసన్నకుమార్ రెడ్డి మండల తెలుగు యువత అధ్యక్షుడు హరి యాదవ్, భాస్కర్ రెడ్డి, భయ్యా రెడ్డి, ఖాదర్ హుస్సేన్, భాస్కర, రఘు, సుబ్బయ్య, మనోహర్ రెడ్డి,నాగేశ్వర్ నాయుడు పాల్గొన్నారు.










