ప్రజాశక్తి -కందుకూరు :మండలంలోని అడవిరాజుపాలెం గ్రామానికి చెందిన టిడిపి ్ట కార్యకర్త గోచిపాతల రమేష్, కోటేశ్వరమ్మ దంపతుల కుమారుడు చందు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మతిస్థిమితం కోల్పోయాడు. కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు శనివారం చందును పరామర్శించారు. తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. చందు కోలుకునేంతవరకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. వైద్య ఖర్చులకోసం రూ. 20వేలు ఆర్థిక సహాయం అందించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు జనిగర్ల నాగరాజు, గ్రామ పార్టీ అధ్యక్షుడు గుండ్లపల్లి వెంకటేశ్వర్లు, నెల్లూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి గోచిపాతల మోషే, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు మద్దసాని కష్ణ, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు తాటిపర్తి రామకష్ణ, మాజీ జడ్పిటిసి అక్కిలగుంట ప్రకాశం, అక్కిలగుంట వరయ్య, మాజీ ఎంపీటీసీ మద్దసాని రమణయ్య, నాయకులు ఆశీర్వాదం, ఏసురత్నం, చంద్రయ్య, బొజ్జా వేణు, గుండ్లపల్లి బ్రహ్మయ్య, మద్దసాని శ్రీను పాల్గొన్నారు.










