మృతిచెందిన డ్రైవర్
ఆర్‌టిసి డ్రైవర్ ఆత్మహత్య
కొడవలూరు :పురుగు మందు తాగి ఆర్‌టిసి డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన కొడవలూరులో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కావలి ఆర్‌టిసి డిపోలో డ్రైవర్‌గా పని చేసే మారెళ్ల వెంకటరమణయ్య(53) భార్యా, పిల్లలతో కలసి ముసునూరులో కాపురముండేవారు.ఏడాది క్రితం భార్యతో విభేదించి కొడవలూరులోని బంధువుల వద్దకు చేరుకున్నారు. అప్పట్నుంచీ బంధువుల వద్దే ఉంటూ కావలికి డ్యూటీకి వెళ్లి వస్తుండేవారు. ఈ క్రమంలో ఏం జరిగిందో కానీ కొడవలూరుకి సమీపంలోని టపాతోపు వద్ద నున్న శిథిలావస్థలోని రొయ్యల ఫ్యాక్టరీ వద్ద మంగళవారం పురుగు మందు తాగి ఆత్మహత్యా యత్నం చేశారు. అపస్మారక స్థితిలో అక్కడే పడి ఉండగా స్థానికులు కొడవలూరులోని బంధువులకు సమాచారం ఇచ్చారు. బంధువులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని అపస్మారక స్థితిలో ఉన్న వెంకటరమణయ్యను నార్తురాజుపాలెంలోని ప్రయివేటు ఆసుపత్రిలో చేర్పించి మెరుగైన వైద్యం కోసం నెల్లూరులోని రామచంద్రారెడ్డి వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మతి చెందినట్లు ఎస్‌ఐ జి. సుబ్బారావు తెలిపారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.










