Nov 13,2023 21:17

గోదావరి వంతెనపై అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢ కొట్టి అగిన జంగారెడ్డిగూడెం డిపో బస్సు
ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం

జంగారెడ్డిగూడెం ఆర్‌టిసి డిపోనకు చెందిన బస్సుకు సోమవారం పెనుప్రమాదం తప్పింది. వివరాలిలా ఉన్నాయి. జంగారెడ్డిగూడెం నుంచి రాజమండ్రికి ప్రయాణికులతో బస్సు బయలుదేరింది. కొవ్వూరు దాటి గోదావరి బ్రిడ్జిపైకి వెళ్లగానే బస్సు అదుపుతప్పి ఎడమవైపు రెయిలింగ్‌పైకి దూసుకెళ్లి అగింది. ఈ ఘటనతో ప్రయాణికులంతా ఒక్కసారిగా అరుపులు, కేకలతో భయాందోళనకు గురయ్యారు. అయితే బస్సు రెయిలింగ్‌పై నిలిచిపోవడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటయపడ్డారు. బస్సు రెయిలింగ్‌ను ఢకొీట్టి ఆగకుంటే పెను ప్రమాదమే జరిగేదని ప్రయాణికులు వాపోయారు. దీనిపై జంగారెడ్డిగూడెం డిపో మేనేజర్‌ గంగాధర్‌ను వివరణ కోరగా బస్సు రెయింగ్‌ను ఢకొీని ఆగిపోయిందన్నారు. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదమూ జరగలేదని, బస్సు ప్రమాదానికి గురికావడానికి గల కారణాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. ప్రయాణికులను వెంటనే మరో బస్సులో రాజమండ్రికి తరలించామని తెలిపారు.