Jun 28,2022 22:28

ప్రశంసా పత్రాలు అందుకున్న వారితో జోన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గిడుగు వెంకటేశ్వరరావు

ప్రజాశక్తి-భవానీపురం: విద్యాధరపురంలోని ఆర్టీసీ జోనల్‌ వర్క్‌షాప్‌, జోనల్‌ స్టోర్స్‌, టైర్‌ రీట్రేడింగ్‌ షాప్‌ (నాన్‌ ఆపరేషన్‌ యూనిట్స్‌) ఉద్యోగులు తమ విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచివారికి ప్రశంసాపత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది. మంగళవారం జోనల్‌ వర్క్‌షాప్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విజయవాడ జోన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గిడుగు వెంకటేశ్వరరావు పాల్గొని ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. జోనల్‌ వర్క్‌షాప్‌లో పనిచేసే మెకానికల్‌ సూపర్‌వైజర్‌ కరీముల్లా, డెప్యూటీ మెకానిక్‌ ఎన్‌.డి.ఆర్‌. మోహన్‌, అసిస్టెంట్‌ మెకానిక్‌ కె. కిషోర్‌బాబు, జోనల్‌ స్టోర్స్‌కి చెందిన సి.హెచ్‌. సత్యశ్రీనివాస్‌, కె. నాంచారయ్య (జూనియర్‌ అసిస్టెంట్‌ మెటీరియల్‌), అక్కౌంట్స్‌ సెక్షన్‌లో డి.శ్రీనివాసరావు (జూనియర్‌ అసిస్టెంట్‌ -ఫైనాన్స్‌), టైర్‌ రీట్రేడింగ్‌ షాప్‌ ఉద్యోగి టి.వై.వి హరినాధ్‌బాబు ప్రశంసా పత్రాలను అందుకున్నవారిలో వున్నారు. ఈ సందర్భంగా ఈడీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఉద్యోగులు తమ విధి నిర్వహణలో అంకితభావం, చిత్తశుద్ధి కనబరిచి సంస్థ అభివద్ధికి దోహదపడాలని సూచిం చారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని సంస్థ ఎదుగుదలకు కషిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వర్క్స్‌ మేనేజర్‌ వాణిశ్రీ, ఎడబ్ల్యుఎమ్‌. కంట్రోలర్‌ ఆఫ్‌ స్టోర్స్‌, డెప్యూటీ చీఫ్‌ ఎకౌంట్స్‌ ఆఫీసర్‌ పాల్గొన్నారు.