ప్రజాశక్తి - భవానీపురం: వైసిపి ప్రభుత్వం పెంచిన ఆర్టీసీ చార్జీలు ఉపసంహరించుకోవాలని పశ్చిమ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ముక్తకంఠంతో నినదించారు. పెంచిన ఆర్టీసీ చార్జీలు వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరుతూ సోమవారం 44వ డివిజన్ విద్యాధరపురం నాలుగు స్తంభాల సెంటర్‌లో టిడిపి డివిజన్ అధ్యక్షులు బొడ్డుపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధగా మాజీ మంత్రి ఎం.కె బేగ్ తనయుడు ఎం.ఎస్. బేగ్ పాల్గొని మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్లుగా పేద, మధ్యతరగతి ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు దూది బ్రహ్మయ్య యాదవ్, బబ్బూరి శ్రీనివాస్, బడుగు గణేష్, బాలు, శివ, మరుపిళ్ళ తిరుమలేష్, తాజుద్దీన్ పాల్గొన్నారు.










