Mar 15,2023 21:52

ఫొటో : వాకర్స్‌ను అందిస్తున్న డిఎంహెచ్‌ఒ

ఆరోగ్యకేంద్రంలో డిఎంహెచ్‌ఒ తనిఖీలు
ప్రజాశక్తి-సీతారామపురం : స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ పెంచలయ్య తనిఖీ చేశారు. పిహెచ్‌సిలోని ప్రసూతి గదులను, ల్యాబ్‌ను తనిఖీ చేసి ఆరోగ్య కేంద్రంలో ప్రసవాలను పెంచాలని, ల్యాబ్‌లో అన్నిరకాల పరీక్షలు చేయాలని సూచించారు. ఫ్లోరోసిస్‌ బాధిత గ్రామాల నుండి వచ్చిన రోగులతో సమావేశమయ్యారు. ఫ్లోరోసిస్‌ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేశారు.
ఫ్లోరోసిస్‌తో బాధపడుతూ నడవ లేని నలుగురికి వాకర్స్‌ను అందించారు. కార్యక్రమంలో జిల్లా ఫ్లోరోసిస్‌ కన్సల్టెంట్‌ డాక్టర్‌ దివ్య, మెడికల్‌ ఆఫీసర్‌ స్వప్న, సిహెచ్‌ఒ బి.మంజుల, ఎంపిహెచ్‌ఇఒ ఎస్‌కె.అబ్దుల్‌ మజీద్‌, ఫార్మాసిస్ట్‌ కృష్ణయ్య, సిబ్బంది, ఫ్లోరోసిస్‌ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.