మాట్లాడుతున్న డాక్టర్ కృష్ణమూర్తి
ఆరోగ్యానికి ఓ వరం యోగా
నెల్లూరు:యోగా అనేది ఆరోగ్యానికి వరం లాంటిదని డాక్టర్ కష్టమూర్తి అన్నారు. ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్, ఎల్‌ఐసి, శేషు స్కూలు సంయుక్త ఆధ్వర్యంలో బుజబుజ నెల్లూరు లోని శేషు స్కూల్ ఆవరణలో బుధవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జి జి హెచ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బి.కష్ణమూర్తి పాల్గొని మాట్లాడుతూ యోగా వల్ల ఉపయోగాలు ఎన్నో ఉన్నాయని, యోగ అనేది ఆరోగ్యానికి ఓ వరం లాంటిదని, మందులు లేకుండానే తగిన ఆసనాలతో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని పొందవచ్చు అని, యోగా భారత సంప్రదాయ వైద్య విధానమని, క్రీస్తుపూర్వం 900 సంవత్సరాల క్రితమే పతాంజలి యోగా మనదేశంలో ప్రారంభమైనదని, దీనిని ఇప్పుడు ప్రపంచ దేశాలు అనుసరిస్తున్నాయని. ఒత్తిడి, మానసిక ఆందోళన ఉన్నవారికి యోగా ఓ వరంలా పనిచేస్తుందని, యోగాతో ఏకాగ్రత పెరిగి అనుకున్న లక్ష్యంను చేరుకోవడానికి ఉపయోగపడుతుందని, అందుకే ప్రభుత్వం అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ప్రచారం కల్పిస్తుందని, పాఠ్యాంశాల్లో ఒక అంశంగా చేర్చిందని తెలిపారు. ప్రముఖ యోగ మాస్టర్ బి.పెంచలయ్య మాట్లాడుతూ బాల్య దశలోనే యోగా అభ్యసనం గురించి అవగాహన కల్పించి, శిక్షణ ఇస్తే వారు శారీరకంగా, మానసికంగా దఢంగా ఉంటారన్నారు. అందరూ ప్రతి నిత్యం యోగా సాధన చేస్తూ ఆరోగ్యంగా జీవించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో పిఎంపి గౌరవ అధ్యక్షులు అనుముల జయప్రకాష్ జిజిహెచ్ మెంబర్ బ్రహ్మారెడ్డి, స్కూల్ కరస్పాండెంట్ ఆదిశేషు, ఎల్‌ఐసి మేనేజరు మాలకొండయ్య, పి.ఎం.పి అధ్యక్షులు శాఖవరపు వేణుగోపాల్, పి.ఎం.పి నాయకులు జి.శేషయ్య, సి.వీరయ్య, డి.శ్రీనివాసులు, శంకర్రావు, మోహన్, సుధాకర్, రాఘవయ్య, సత్యనారాయణ, సాయి, భరత్, రవి, అశోకు, నారాయణ, కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు.










