Mar 14,2023 22:07

గుడిబండలో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న డిప్యూటీ డిఎంహెచ్‌ఒ

ఓబుల దేవర చెరువు : చిన్నారులు ఆరోగ్యసూత్రాలు పాటించేలా చూడాలని వైద్యులు అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని అల్లా పల్లి ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, రైన్‌బో ప్రైవేటు పాఠశాల, గౌనిపల్లి అంగన్వాడీ కేంద్రాన్ని డిపిఎంఒ చిన్నకుళ్లాయప్ప నాయక్‌ మంగళవారం తనిఖీ చేశారు. ఆయా పాఠశాలల్లో చేపటిట్న జాతీయ నులిపురుగుల నివారణా కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ రక్త హీనతను అధిగమించినప్పుడే ఆరోగ్యకర సమాజం ఏర్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిహెచ్‌ఒ సుభాషిని, ల్యాబ్‌ టెక్నీషియన్‌ నరేంద్ర, అశ్విని, అంగన్వాడీ కారయకరతల షమీం తదితరులు పాల్గొన్నారు.
తలుపుల: జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా మండల వ్యాప్తంగా ఉన్న అన్ని అంగన్వాడీ, ప్రయివేటు, ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలకు ఆల్‌బెండాజోల్‌ మాత్రలను వేశారు. మండల వ్యాప్తంగా 1 నుండి 19 సంవత్సరాల లోపు 5962 మంది పిల్లలు ఉండగా, అందులో మంగళవారం 5310 మంది పిల్లలకు మాత్రలు వేసినట్లు వైద్యాధికారులు తెలిపారు.
సోమందేపల్లి : జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా మంగళవారం స్థానిక ప్రభుత్వ వైద్యులు డాక్టర్‌ నరేష్‌ కుమార్‌, హరీష్‌ కుమార్‌, మండల విద్యాధికారి ఆంజనేయ నాయక్‌, ఇఒఆరడి నాగరాజు రావ్‌, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఖాదరవలి ఆధ్వర్యంలో పిల్లలకు మాత్రలు వేయించారు. తల్లిదండ్రులు పిల్లల ఆహార అలవాట్లపై శ్రద్ధ వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిహెచ్‌ఒ మనోహర్‌ రెడ్డి, ఆరోగ్య పర్యవేక్షకులు రవీంద్ర, నారాయణమ్మ, ఎఎన్‌ఎంలు లక్ష్మీదేవి, శారద ,తదితర ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
గుడిబండ : స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, అంగన్వాడి సెంటర్లలో వైద్య సిబ్బంది జాతీయ నులి పురుగుల నిర్మూల దినోత్సవ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పెనుగొండ డివిజన్‌ డిప్యూటీ డిఎం హెచ్‌ఒ మంజువాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులకు చిన్నారులకు నులిపురుగుల నిర్మూలనపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గుడిబండ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని సౌందర్య, ఎంపిహెచ్‌ఎస్‌ వెంకట్‌ నారాయణ, ఎఎన్‌ఎంలు, వైద్యసిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
రొద్దం : మండల ప్రాథమిక వైద్య అధికారి డాక్టర్‌ జగదీష్‌ బాబు ఆధ్వర్యంలో పెద్దమంతుర్‌ హైస్కూల్‌లో జాతీయ నులి పురుగుల నివారణ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. ఆల్‌బెండాల్‌జోల్‌ మాత్రలు మింగడం వల్ల ఒకటి నుంచి 19 సంవత్సరముల బాల, బాలికలకు రక్తహీనత నివారించబడుతుందనానరు. అనంతరం హైస్కూల్‌లోనిగల మరుగుదొడ్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఒ మహాలక్ష్మి, పాఠశాల హెచ్‌ఎం, ఉపాధాయయులు, ఎంపిహెచ్‌ఒ బి. శ్రీనివాసులు, ఇఒఆర్‌డి కేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బత్తలపల్లి : మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రవేట్‌ విద్యాసంస్థలలో మంగళవారం జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించారు. మధ్యాహ్న భోజనం అనంతరం చిన్నారులకు, విద్యార్థులకు ఆల్బెండజోల్‌ మాత్రలు పంపిణీ చేశారు. సత్యసాయి జిల్లా ఎన్టీడీ కార్యక్రమ నోడల్‌ అధికారి(సిరికల్చర్‌ జేడీ) పద్మమ్మ మండలంలోని సంజీవపురం వద్దనున్న కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి గంగిరెడ్డి, ఎంఇఒ చాముండేశ్వరి, ఐసిడిఎస్‌ సూపర్‌వైజర్లు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
హిందూపురం : నులి పురుగుల నివారణతో చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యానికి నాంది పలుకుదామని వైద్యాదికారి ఆనంద్‌బాబు పేర్కొన్నారు. జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం పట్టణంలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు ఆల్‌ బెండజోల్‌ మాత్రలు వేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు మంజుశ్రీ, సిఒలు వెంకటరమణ, శివన్న, సరస్వతి, ముస్తఫా, రమేష్‌, అంగన్‌ వాడీ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.