ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీలు
ప్రజాశక్తి-మర్రిపాడు : స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆత్మకూరు డివిజన్ ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ జి.వెంకటప్రసాద్ మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఆరోగ్య కేంద్రంలోని రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి సురక్ష మాతృత్వ అభియాన్ పథకం కింద ప్రతి నెలా 9న గర్భిణులకు వైద్య పరీక్షలు చేస్తున్నామన్నారు. మంగళవారం, సంగం, మర్రిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేశామని, వైద్యాధికారి డాక్టర్ కల్పన 25మంది గర్భిణులకు వైద్యపరీక్షలు నిర్వహించి వారికి మందులు అందజేశారు. గర్భిణులు అంగన్‌వాడీ కేంద్రాలలో పౌష్టికాహారం తీసుకుంటున్నారో లేదో ఎఎన్‌ఎంలు పరిశీలించాలన్నారు. గతనెలా ఇటీవల 10కాన్పులు జరుగగా జెఎస్‌వి కింద తల్లుల ఖాతాల్లో నగదు జమైందన్నారు. గర్భిణుల సంరక్షణ, మాతృ మరణాలు తగ్గించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఫ్యామిలీ డాక్టర్ పధకంలో ఎంతమంది షుగర్, డయాబెటీస్, ఇతర రోగులు ఎంత మంది వస్తున్నారో డేటాను అప్లోడ్ చేశామన్నారు. ఆయన వెంట సూపర్‌వైజర్ ఖాజా మొహిద్దీన్, వైద్య సిబ్బంది ఉన్నారు.










