Mar 16,2023 21:20

అర..కొరే

ప్రజాశక్తి - కడప ప్రతినిధి
రాష్ట్ర బడ్జెట్‌-2023 అరకొర కేటాయింపులతో సరిపెట్టింది. జిల్లా ప్రగతి చోదకశక్తులైన ఇరిగేషన్‌, వ్యవసాయం, పారిశ్రామిక, సేవల రంగాలకు ఆశించిన స్థాయిలో కేటాయింపులు చేయలేదు. జిల్లాలో ఉక్కు పరి శ్రమ ఏర్పాటుకు రూ.2,200 కోట్లు, పులివెందులలో ముర్రాజాతి గేదెల ఉత్పత్తి, కొప్పర్తి పారిశ్రామికవాడ, వైఎస్‌ఆర్‌ ఎలక్ట్రానిక్‌ క్టస్టర్‌లో పరిశ్రమల ఏర్పాటుకు మౌలిక సదు పాయాల కల్పన, రాయచోటిలో పారిశ్రామిక శిక్షణా సంస్థ వంటి పేర్లతో ఊరట కలిగించే ప్రయత్నం చేయడం గమనార్హం. నిధుల కేటాయింపుల వివరాలల్లో స్పష్టత కనిపించకపోవడం నిరు త్సాహాన్ని కలిగించింది. ఏదేమైనా జిల్లాలో సాగునీటి పారుదల, పారిశ్రామిక రంగాల కేటార ుుంపులను పరిశీలిస్తే మొక్కుబడి కేటాయింపుల్ని తలపించిందని చెప్పవచ్చు. రాష్ట్ర బడ్జెట్‌ -2023- 24ను ఆర్థికశాఖామంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్‌రెడ్డి రూ.2,79, 279 కోట్లతో ప్రవేశపెట్టారు. జిల్లాకు సంబంధించిన కేటాయింపులను పరిశీలిస్తే నిరుత్సా హాన్ని కలిగించింది. సాగునీటి పారుదల రంగ కేటాయింపులను పరిశీలిస్తే జిఎన్‌ఎస్‌ఎస్‌, హెచ్‌ ఎన్‌ఎస్‌, కెసికెనాల్‌ కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలతో ముడిపడి ఉండడంతో స్పష్టత లోపిం చింది. గతేడాది జిఎన్‌ఎస్‌ఎస్‌కు రూ.439. 30కోట్లు కేటాయించగా తాజాగా రూ.855.35 కోట్లు, పిబిసికి గతేడాది రూ.238.95 కోట్లు కాగా తాజాగా రూ.106.59 కోట్లు, హెచ్‌ఎన్‌ఎస్‌కు రూ.122.69 కోట్లు, వెలిగల్లుకు రూ.1.5 కోట్లు, చెయ్యేరుకు రూ.20 లక్షలు కేటాయింపులతో సరిపెట్టారు. గత బడ్జెట్‌లో సాగు నీటిపారుదల రంగానికి రూ.8,087 కోట్లు కేటాయించడం తెలిసిందే. 2023-24 బడ్జెట్‌లో రూ.1542.17 కోట్లు కేటాయించినట్లు కనిపి స్తోంది. పారిశ్రామిక రంగాన్ని పరిశీలిస్తే ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు రూ.2,200 కోట్లు, కొప్పర్తి, వైఎస్‌ఆర్‌ మాన్యుఫ్యాక్షరింగ్‌ క్లస్టర్‌లో పరిశ్రమల ఏర్పాటుతో 35 వేల ఉద్యోగాలు వస్తాయనే మొక్కుబడి ప్రస్తావన చేసింది. పులివెందుల అర్బన్‌ డెవలప్‌ మెంట్‌ అధారిటీ, పులివెందుల్లో వెటర్నరీ బయో లాజికల్‌ ఇన్సిట్యూట్‌లో ముర్రాజాతి గెదేల ఉత్పత్తికి శ్రీకారం చుట్టింది. యోగి వేమన యూనివర్శిటీకి రూ.32.83 కోట్లు, సిపిబ్రౌన్‌కు రూ.10 లక్షలు, చొప్పున కేటాయించారు. ఉమ్మడి జిల్లాలోని 4.80 లక్షల మంది రైతులకు వైఎస్‌ఆర్‌ రైతు భరోసా, రూ.500 కోట్లతో సున్నా వడ్డీ పథకం కింద లబ్ధిపొందనున్నారు. జిల్లా సర్వజన ప్రభుత్వాస్పత్రిని సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిగా అప్‌గ్రెడేషన్‌, ఉమ్మడి జిల్లాలోని అన్నమయ్య, పింఛా, ఎల్‌ఎస్‌పి, కుందూ-పెన్నా, కాలేటివాగు ఎత్తిపోతల పథకాల పనులకు సంబంధించిన కేటాయింపుల ప్రస్తావన చేయలేదు.కాకి లెక్కల బడ్జెట్‌
జగన్‌ ప్రభుత్వం, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రవేశపెట్టిన 2023-24 రాష్ట్ర బడ్జెట్‌ 'కాకి లెక్కల బడ్జెట్‌' గా ఉంది. ఉత్పాదక, ఉపాధి రంగానికి రాష్ట్ర బడ్జెట్లో కేవలం రూ. 30 వేల కోట్లు మాత్రమే చూపించారు. గతలోనూ 32 వేల కోట్లు చూపించి, రూ. 16 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. రాయలసీమ పెండింగ్‌ ప్రాజెక్టులకు నిధులు కేటాయించలేదు. 'జాబ్‌ క్యా లెండర్‌' ప్రస్తావన లేకుండానే ముగించేశారు. జిల్లాలోని ప్రాజెక్టుల కింద పంట కాలవల నిర్మా ణానికి నిధులు ఈ బడ్జెట్లో విస్మరించారన్నారు.
-జి.చంద్రశేఖర్‌, సిపిఎం జిల్లా కార్యదర్శి
పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తికావు
2023-24 వార్షిక సంవత్సరానికి రూ. 2,79,279 లక్షల కోట్ల కేటాయింపులో నీటి పారుదల , పారిశ్రామిక రంగాలనే పూర్తిగా విస్మ రించారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి కూడా కావు. జిల్లాలో గాలేరు-నగరి, హంద్రీ నీవా, రాజోలి నిర్మాణ, తెలిపోయిన అన్నమయ్య ప్రాజెక్టు పూర్తవడం సాధ్యం కాదు. వ్యవసాయ రంగానికి నిధులను అంకెల గారడితో కేటాయించారు.
- గాలి చంద్ర, సిపిఐ జిల్లా కార్యదర్శి.
పారిశ్రామిక అభివద్ధి అసాధ్యం
బుగ్గన ప్రవేశపెట్టిన 2023 -24 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ వల్ల రాష్ట్ర అభివద్ధి ఏమాత్రం జరగదని, కేవలం సంక్షేమానికి మాత్రమే కొద్దిగా ప్రాధాన్యతను ఇచ్చారు. పారిశ్రామిక అభివద్ధికి ఈ బడ్జెట్లో ఒరిగిందేమీ లేదన్నారు. కడప ఉక్కు ఫ్యాక్టరీకి రూ. 20 కోట్లు కేటాయించి ఉంటే జగన్‌మోహన్‌రెడ్డి చిత్తశుద్ధి బయటపడి ఉండేది. నిరుద్యోగులకు మొండిచెయ్యి చూపించారు.
- కాంగ్రెస్‌ కడప జిల్లా అధ్యక్షుడు నీలి శ్రీనివాసరావు విద్యారంగానికి తూట్లు
2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో విద్యారంగానికి 10.6 శాతం నిధులు కేటాయించిందని, గత సంవత్సరంతో పోల్చితే 0.2 తక్కువ నిధులు కేటాయించడం దారుణమన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల వల్ల విద్యార్థుల సంఖ్య పెరిగిందని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం అమ్మఒడికి ఒక్క రూపాయీ అదనపు కేటాయింపులు చేయలేదు.
- యుటిఎఫ్‌ అధ్యక్షులు మాదన విజయ కుమార్‌
రైతుకు భరోసా ఇవ్వని బడ్జెట్‌
వ్యవసాయం, అనుబంధ రంగాలకు బడ్జెట్‌ కేటాయింపులు తగినంతగా లేవు. పంట రుణాలకు రూ.2500 కోట్లు అవసరమైతే రూ.500 కోట్లు కేటాయించారు. డ్రిప్‌ పరికరాలను మెట్ట ప్రాంత రైతులకు అందించడానికి అవస రమైన నిధులు కేటాయించకపోవడం శోచనీయం.
-బి. దస్తగిరిరెడ్డి, ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి
నిరుద్యోగులకు నిరాశ
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో అన్ని రంగాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం మంచి పరిణామైనప్పటికీ నిరుద్యోగులకు ఒకరకంగా ఇది నిరాశ పరిచినట్లే చెప్పవచ్చును. నూతన ఉద్యోగ నియామకాలు మీద బడ్జెట్‌లో ప్రస్తావన లేక పోవడం బాధాకరం. రోజుకు పెరుగుతున్న మానవ వనరుల దష్టిలో పెట్టుకొని సంబంధించిన ఉద్యోగ నియామకాలు చేపడితే సుస్థిరంగా అభివద్ధి సాధ్యమవుతుంది.
-డాక్టర్‌ రమేష్‌ పిచ్చారు. ఆర్థిక శాఖ విశ్లేషకులు, కడప.