Jun 05,2023 21:11

ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న కలెక్టర్‌, జెసి

రాయచోటి : ప్రజా సమస్యలను వెనువెంటనే పరిష్కరించేందుకు జగనన్నకు చెబుదాం-స్పందన కార్యక్రమం ద్వారా అందిన అర్జీలను సత్వరం పరిష్క రించాలని కలెక్టర్‌ గిరీష అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని స్పందన హాలు నందు ప్రజా ఫిర్యాదుల స్వీకరణ ''జగనన్నకు చెబుదాం-స్పందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ గిరీషతోపాటు జెసి ఫర్మాన్‌ అహ్మద్‌, డిఆర్వో సత్యనారాయణలు ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను అర్జీదారుడు సంతప్తిచెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. ఇందుకు ఆయా శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారద ర్శకంగా విచారణ చేయాలని, మరలా అర్జీ రీ ఓపెన్‌ కాకుండా నాణ్యతగా ఎండా ర్స్మెంట్‌ చేయాలని సూచించారు. దరఖాస్తులు పెండింగ్‌ ఉండరాదని బియాండ్‌ ఎస్‌ఎల్‌ఏలో ఉన్న దరఖాస్తులపై ద ష్టి పెట్టి వెంటనే పరిష్కారం చూపా లన్నారు. అర్జీ నాణ్యతగా పరిష్కరించడం, సరైన విధంగా అర్జీదారునికి ఎండా ర్స్మంట్‌ చేసే విధానంలో సిబ్బందికి శిక్షణ నిర్వహించాలని శాఖాధికారులకు సూచించారు. హెచ్‌ఓడి లాగిన్‌ లలో ఆ శాఖకు సంబంధించి నమోదయ్యే అన్ని దరఖాస్తులు కనపడాలని ఒకవేళ అందులో ఏదైనా సమస్య ఉంటే కలెక్టరేట్‌ ఏఓను కలిసి సమస్య పరిష్కరించుకోవాలని సూచించారు. అనంతరం అర్జీదారుల నుండి వారు అర్జీలను స్వీకరించారు. కార్యక్రమంలో జిల్లా వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు.
మోకాళ్లపై కూర్చుని సమస్యలు తెలుసుకున్న జెసి
కలెక్టరేట్లో సోమవారం జగనన్నకు చెబుదాం ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. వీరబల్లి మండలం వంగిమలకు చెందిన వికలాంగురాలు ఎస్‌.జరీనాబేగం పాకుతూ కార్యక్రమంలో అర్జీ సమర్పించడానికి వచ్చారు. దీనిని గమనించిన జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌ అర్జీదా రురాలు వద్దకే వచ్చి నేలపై మోకాళ్లమీద కూర్చుని సావధానంగా ఆమె సమ స్యను ఆలకించారు. చిన్నప్పుడు పోలియో వల్ల తన రెండు కాళ్లు చచ్చు బడి పోయాయని నడవలేని పరిస్థితిలో ఉన్నానని మూడు చక్రాల వాహనం మం జూరు చేయాలని వేడుకున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అర్హతలను పరి శీలించి ఆమెకు వెంటనే మూడు చక్రాల వాహనం మంజూరు చేయాలని జిల్లా వికలాంగ సంక్షేమ శాఖ అధికారికి జాయింట్‌ కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు.