Dec 26,2022 22:16

ఫిర్యాదుదారుల సమస్యలు వింటున్న కలెక్టర్‌ బసంత్‌ కుమార్‌

       పుట్టపర్తి అర్బన్‌ : స్పందన అర్జీలకు సంబంధించి అర్జీదారులకు త్వరితగతిన పరిష్కారం చూపాలని కలెక్టర్‌ బసంత్‌కుమార్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎనుములపల్లి క్రాస్‌ సమీపంలో ఉన్న ఆర్డీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయిలో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ ''స్పందన'' కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ టిఎస్‌.చేతన్‌, డిఆర్‌ఒ కొండయ్య, పుట్టపర్తి ఆర్డీవో భాగ్యరేఖతో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో క్షుణ్నంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి, అర్జీదారుడు సంతప్తిచెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. స్పందన కార్యక్రమంలో 134 వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో స్పందన తహశీల్దార్‌ గోపాలకష్ణ, డిఆర్‌డిఎ పీడీ నరసయ్య, సిపిఒ విజరు కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.