May 18,2023 21:03

నిమ్మనపల్లి : ప్రభుత్వ పథకాలను వివరిస్తున్న ఎమ్మెల్యే నవాజ్‌ బాషా

నిమ్మనపల్లి : అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతు న్నాయని ఎమ్మెల్యే నవాజ్‌బాషా పేర్కొన్నారు. గురువారం మండలం రాచవేటివారిపల్లి పంచాయతీ ఎగువమాచిరెడ ి్డగారిపల్లిలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎగువమాచిరెడ్డిగారిపల్లి, సాయంత్రం దిగుమాచిరెడ్డిగారిపల్లి, గుడ్ల వారిపల్లి, ఆచార్లపల్లెలో ఎంపిపి నరసింహులు, స్థానిక సర్పంచ్‌ సుబ్ర మణ్యం, మండల ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, సచి వాలయ సిబ్బంది, వాలంటీర్లతో కలసి ప్రతి ఇంటిని సందర్శించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ప్రజలను అడిగి తెలుసు కున్నారు. నాలుగేళ్ల వైసిపి పాలనలో ప్రతి ఇంటికి అందిన సంక్షేమ పథకా గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా పలువురు ఇళ్ల పట్టా మంజూరు చేసినప్పటికీ స్థలం చూపించలేదని, ఇంటి నిర్మాణ పనులు చేసిన బిల్లులు చెల్లించలేదని, సిసిరోడ్లు, మురికి కాలవలను వేయిం చాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకవచ్చారు. ఎగుమాచిరెడ్డిగారిపల్లికి అంగన్వాడీ కేంద్రం నూతన భవనాన్ని మంజూరు చేయాలని కోరారు. వాటిని వెంటనే పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎంపిడిఒ లీలా మాధవి, ఆయాశాఖల ఎఇ లకు ఆదేశించారు. రాష్ట్రాన్ని అభివద్ధి పథంలో నిలపడమే కాకుండా, ప్రజల ఆర్థిక స్థితి గతులు మెరుగుపరిచేందుకు ముఖ్యమంత్రి నిరంతరం కషి చేస్తున్నారన్నారు. అభివద్ధే ధ్యేయంగా పాలన సాగిస్తున్న సిఎం జగన్‌మోహన్‌రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు మద్దతు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సుబ్రమణ్యం, సింగిల్‌ విండో అధ్యక్షులు రెడ్డిశేఖర్‌రెడ్డి, వైసిపి మండల ఇన్‌ఛార్జి ఆర్‌ఐ రమణారెడ్డి, ఆర్‌బికె చైర్మన్‌ ప్రవీణ్‌ కుమార్‌రెడ్డి, మండల సచివాలయాల కన్వీనర్‌ రామ మోహన్‌రెడ్డి, ఎంపిటిసి రెడ్డి వెంకటేష్‌, తహశీల్దార్‌ సిఆర్‌ మంజుల, సిఐ శివాంజనేయులు, ఎస్‌ఐ రామకష్ణ, పంచాయతీ కార్యదర్శి గాయత్రి, నాయకులు రవికుమార్‌ రెడ్డి, చంద్రారెడ్డి, చక్రపాణిరెడ్డి, నరేంద్రరెడ్డి, నాగ రాజా, షావల్లి, సర్పంచులు, ఎంపిటిసిలు,అధికారులు పాల్గొన్నారు. కంభంవారిపల్లి : పీలేరునియోజకవర్గం కె.వి.పల్లి మండలం గర్నిమిట్ట గ్రామ సచివాలయం మోటుపల్లివాండ్లపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని రాళ్ల మాదిగపల్లి, పోతిరెడ్డిగారిపల్లి, మోటుపల్లివాండ్లపల్లి, గోడ వాండ్ల పల్లి,ఎరికల పల్లి, దిన్నె హరిజనవాడ, పెడగంటపల్లి, గాజులపల్లి, నారేవాండ్లపల్లి, చింతల రామచంద్రారెడ్డి, కార్యకర్తలు, గ్రామ వాలంటీర్లు మరియు అధికారులతో కలసి గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాలతో పేదల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయని అన్నారు. విద్య , వైద్య, వ్యవసాయ రంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.