ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక ఎన్‌విఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో రాజంపేట మున్సిపాలిటీకి సంబంధించిన మున్సిపల్ కౌన్సిలర్ల, సచివాలయ కన్వీనర్ల, వాలంటీర్ల, గృహ సారధుల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రతిపక్షాలకు బుద్ధి వచ్చేలా పనిచేయాలన్నారు. అర్హులైన వారికి న్యాయం చేయాలని, ఎవ్వరూ భయపడనవసరం లేదన్నారు. రాబోయే కాలంలో ప్రజలకు మరింత సేవ చేసేందుకు ఉపయోగపడే సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసులురెడ్డి, ఎన్నికల పరిశీలకులు కృష్ణమూర్తి పాల్గొన్నారు.










