Jan 10,2023 21:10

అంబేద్కర్‌ నగర్‌లో మురుగు కాలువలను పరిశీలిస్తున్న ఎమ్మెల్సీ

         హిందూపురం : కులం, మతం, పార్టీ అన్నవి చూడకుండా అర్హులందరికీ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తోందని ఎమ్మెల్సీ మొహమ్మద్‌ ఇక్బాల్‌ పేర్కొన్నారు. పట్టణంలోని 27వ వార్డు సచివాలయ పరిధిలో మంగళవారం గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్బంగా వార్డులో గడపగడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ అవి అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం నాయకులు ఓట్ల కోసం మాత్రమే ప్రజల వద్దకు రావడం జరిగేదని, గెలిచిన తర్వాత పట్టించుకునేవారు కాదన్నారు. వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు ఇంటి వద్దకే అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అబ్దుల్‌ ఘనీ, కౌన్సిలర్‌ నాగేంద్రమ్మ, వైస్‌ ఛైర్మన్‌ జబీవుల్లాతో పాటు కౌన్సిలర్లు, వైసిపి నాయకులు పాల్గొన్నారు.