ప్రజాశక్తి - లింగసముద్రం అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంగా ముఖ్యమంత్రి పని చేస్తున్నారని ఎంఎల్‌ఎ మానుగుంట మహీధర్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన మండలంలోని మాల కొండ్రాయునిపాలెం గ్రామంలో జరిగిన గడప గడనకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలో ఇంటింటికి తిరిగి సంక్షేమ పథకాలను వివరించారు.గ్రామంలో మురుగు నీరు రోడ్డు మీదే ప్రవహిస్తుందని, సైడు కాలువలు ఏర్పాటు చేయాలని కోరడంతో ఎంఎల్‌ఎ స్పందించారు. కాలువ నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానని చెప్పారు. అనంతరం పంచాయితీలోని కొత్త మాల కొండ్రాయునిపాలెం,ముక్తేశ్వరం గ్రామాల్లో తిరిగి గ్రామస్తులతో మాట్లాడారు. కార్యక్రమంలో డిఆర్‌డిఎ పిడి సాంబశివారెడ్డి,ఎంపిపి పెన్నా కృష్ణయ్య,వైసిపి మండల కన్వీనర్ పి.తిరుపతిరెడ్డి, మండల మీడియా అధికార ప్రతినిధి వరికూటి క్రిష్ణారెడ్డి,తహశీల్ధార్ సుధాకర్,ఎంపిడిఓ చంద్రసేన్,ఎఎంసి వైస్ చైర్మన్ మేకనబోయిన శ్రీనివాసులు,గ్రామా సర్పంచ్ వంటేల శ్రీనివాసులు,ఎస్‌ఐ ఆవుల వెంకటేశ్వర్లు,కాట్రగుంట వెంకటప్పనాయుడు, సర్పంచ్‌లు పి.మహేష్,డి.సీతారామయ్య,పి.రాఘవులు,డి.మల్లికార్జున,ఎంపిటిసి సభ్యులు వి.క్రిష్ణారెడ్డి,దగ్గు వెంకటేశ్వర్లు,చిలకా చంటి పాల్గొన్నారు.










