ప్రజాశక్తి - వీరబల్లి : రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా కన్వీనర్లు, వాలంటీర్లు సైనికుడిలా పనిచేయాలని రాజంపేట శాసనసభ్యులు మేడా మల్లికార్జునరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఎంపిడిఒ కార్యాలయంలో అభివద్ధి కార్యక్రమాలపై సమావేశం నిర్వహించారు. మండల అధ్యక్షుడు గాలివీటి రాజేంద్రనగర్ రెడ్డి అధ్యక్షత వహించిన కార్యక్రమంలో రాజంపేట శాసనసభ్యులు వెంకట మేడా మల్లికార్జున్‌రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల వద్దకే పాలన అందించడానికి సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టారని చెప్పారు. 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ ఏర్పాటుచేసి ఇంటికే సంక్షేమ పథకాలు అందేలా పరిపాలన చేస్తున్నారని వివరించారు. సంక్షేమ పథకాలు అందరికీ అందాయా లేదా అని తెలుసు కునేందుకు ఒక్కొక్క సచివాలయానికి ముగ్గురిని కన్వీనర్లుగా నియమించామని చెప్పారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు గాలివీటి రాజేంద్రనాథ్‌రెడ్డి, మండల నాయకులు వీరనాగిరెడ్డి, వైసిపి మండల అధ్యక్షులు ఉమా మహేశ్వర్ రాజు, లాయర్ పవన్ కుమార్‌రెడ్డి, మాజీ ఎంపిపి నాగభూషణం, జడ్‌పిటిసి శివరాం గౌడ్, మాజీ ఎంపిటిసి సుబ్బరామరాజు, సొసైటీ అధ్యక్షులు రామ్మోహన్‌రెడ్డి, అమర్‌నాధరెడ్డి, రామంజులరెడ్డి, సర్పంచులు, కన్వీనర్లు వాలంటీరు,్ల వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










