Dec 22,2022 22:42

అధికారులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి

బత్తలపల్లి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌నెడ్డి పాలనలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయనిధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రమైన బత్తలపల్లి సత్యసాయి నగర్‌, బీసీ కాలనీ, ఎస్టీ కాలనీ, మైనార్జీ కాలనీలోనూ ఏపీ కురుబ కార్పోరేషన్‌ చైర్మన్‌ కోటి సూర్యప్రకాష్‌ బాబు, జెడ్పీటీసీ కోటి సుధ ఆధ్వర్యంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈసందర్భంగా ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో , ఎంపీపీ గుర్రం వనజ, సర్పంచు కాసమ్మ, ఉప సర్పంచు కోటి గోపినాథ్‌, కోటి సురేష్‌, తహశీల్దార్‌ యుగేశ్వరిదేవి, ఎంపీడీవో మనోహర్‌తో పాటు ఆయా శాఖల అధికారులు, వైసిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక మార్పులు : ప్రవేట్‌ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నామని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అన్నారు. గురువారం స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో 8వ తరగతి విద్యార్ధినీ విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌లను పంపిణీ చేశారు.
ఎంఇఒ, హెచ్‌ఎంపై ఆగ్రహం : పద్ధతిగా ఉద్యోగాలు చేయనప్పుడు ఎందుకు ఉద్యోగాలు అంటూ ఎంఇఒ చాముండేశ్వరి, హెచ్‌ఎం నాగరత్నమ్మలపై ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం పాఠశాలలో ట్యాబ్లను పంపిణీ చేసేందుకు వచ్చిన ఎమ్మెల్యే దృష్టికి పాఠశాల ఫేరెంట్స్‌ కమిటీ అధ్యక్షులు రామాంజనేయులు పలు సమస్యలను తీసుకెళ్లారు. అభివృద్ధి పనులకు సంబందించి నిధుల విడుదల సమస్యలపై ఆయన హెచ్‌ఎం, ఎంఇఒపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భోజన ఏజెన్సీ నిర్వహకులు తమకు బియ్యం సరిగా ఇవ్వడంలేదని ఫిర్యాదు చేశారు. పిల్లలకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే అధికారులను హెచ్చరించారు.
కదిరి టౌన్‌ : జగనన్న పాలనలో ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్లు ఎమ్మెల్యే సిద్ధారెడ్డి పేర్కొన్నారు. గురువారం కదిరి మున్సిపాలిటీ, కుటాగుళ్ల -3 వార్డులో ఎమ్మెల్యే డాక్టర్‌ పివి సిద్ధారెడ్డి యువ నాయకులు ప్రణీత్‌ రెడ్డితో కలిసి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఇంటింటికి తిరిగి ప్రజా సంక్షేమ పథకాల అమలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీహరి బాబు, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ రమేష్‌ రెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ కొమ్ము గంగాదేవి శంకర, ఎస్‌ఎండి ఇస్మాయిల్‌, కౌన్సిలర్లు ఆవుల స్వామి, మహమ్మద్‌, రంగారెడ్డి, టెంపుల్‌ చైర్మన్‌ గోపాలకృష్ణ, భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు నాగరాజు, సింగల్‌ విండో అధ్యక్షులు ఆంజనేయులు తదితరులతో పాటు ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పరిగి : మండలంలోని కొడిగినహళ్లిలో పంచాయతీలో గురువారం నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్‌నారాయణ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన ఇంటింటికి తిరుగుతూ ప్రజాసంక్షేమ పథకాల అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారుల సమస్యలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీరామప్ప, శ్రీరాములు, ప్రభాకర్‌, చిక్కన్న, నారాయణ, మారుతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.