Jun 06,2023 20:18

ఫొటో : సంక్షేమ పథకాల కరపత్రాలు అందజేస్తున్న ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి

అర్హులందరికీ సంక్షేమ పథకాలు
ప్రజాశక్తి-దగదర్తి : ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తున్నట్లు ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం మండల పరిధిలోని చెన్నూరు ఎస్‌టి కాలనీ అరుంధతీయవాడలో తిమ్మారెడ్డి పాలెంలో గడప గడపకు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పేదవాడు ధనవంతుడు లాగా ఉండాలని ఉద్దేశంతో అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన ఏకైక నాయకుడని కొనియాడారు.
గత ప్రభుత్వంలో ఒక పని కావాలంటే కార్యాలయం చుట్టూ కాళ్లు అడిగేలా తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల్లోని సచివాలయం ఏర్పాటు చేసి అధికారులను అందుబాటులో ప్రజల కష్టాలు తీర్చాడని వారన్నారు. కార్యక్రమంలో ఎంపిపి తాళ్లూరు వెంకట ప్రసాద్‌ నాయుడు, పోలీస్‌ హౌసింగ్‌ బోర్డ్‌ డైరెక్టర్‌, చెన్నూరు వైసిపి సీనియర్‌ నాయకులు పి.అనిల్‌ రెడ్డి, ఎంపిడిఒ విజరు కుమార్‌, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.