Jan 13,2023 22:23

ఫొటో : మాట్లాడుతున్న తహశీల్దారు పద్మావతి

అర్హులందరికీ పట్టాలు పంపిణీ
ప్రజాశక్తి-జలదంకి : ప్రభుత్వ భూములు పొంది ఉన్న అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ పట్టాలు మంజూరు చేస్తామని తహశీల్దారు పద్మావతి అన్నారు. అన్నవరం సచివాలయం కేంద్రంలో శుక్రవారం సర్పంచ్‌ గుమ్మడి మార్తమ్మ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ భూములు పొందిన వారి నుండి అర్జీలు స్వీకరించారు.
కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు పాలవల్లి మాలకొండారెడ్డి, అన్నవరం ఎంపిటిసి సభ్యులు కోర్సుపాటి మహదేవరెడ్డి, వైసిపి నాయకులు గుమ్మిడి రమేష్‌, విఆర్‌ఒ శివకుమార్‌, విఆర్‌ఎలు వి.బాబు, సిహెచ్‌.మల్లికార్జును పాల్గొన్నారు.