Jan 04,2023 21:41

పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి

     ఓబులదేవరచెరువు : అర్హుత ఒక్కటే ప్రామాణికంగా తీసుకుని ప్రతి ఒక్కరకీ పింఛన్లను అందజేస్తున్నామని ఎమ్మెల్యే దుద్దకుంట శ్రీధర్‌రెడ్డి తెలియజేశారు. బుధవారం మండల కేంద్రంలోని తహశీల్దార్‌ కార్యాలయంలో వైఎస్సార్‌ పింఛను కానుక పెంపు, కొత్త పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులు ఏ ఒక్కరికి దగ్గరకు వెళ్లకుండా కేవలం సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే వారి ఇంటి వద్దకే వచ్చి పింఛన్లు ఇచ్చేలా ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి చర్యలు తీసుకున్నారని చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వంలోనూ ఇలా జరగలేదన్నారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలను వర్తింపజేస్తున్నట్లు చెప్పారు. రానున్న రోజుల్లో కూడా జగన్‌కు ప్రజలు మద్దతునివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసిపి కన్వీనర్‌ కోళ్ల కష్ణారెడ్డి, ఎంపీపీ పర్వీన్‌ భాను, జడ్పిటిసి కుర్లి దామోదర్‌ రెడ్డి, మార్కెట్‌ యార్డ్‌ ఛైర్మన్‌ శ్రీనివాస్‌ రెడ్డి, సర్పంచులు గోవిందు, వెంకటరమణ, షాజియా మజీద్‌, పఠాన్‌ ఆబీద రఫిక్‌, జగన్మోహన్‌ చౌదరి, రంగారెడ్డి, రామ సుబ్బారెడ్డి, కో ఆప్షన్‌ సభ్యుడు నిసార్‌ అహ్మద్‌, షామీర్‌ బాషా, లక్ష్మి రెడ్డి, ఎంపీడీవో పోలప్ప, తహశీల్దార్‌ శ్రీధర్‌ పాల్గొన్నారు.