Jan 07,2023 18:50

నూతన పింఛన్లను అందజేస్తున్న ఎంఎల్‌ఎ మహీధర్‌రెడ్డి

ప్రజాశక్తి - లింగసముద్రం  అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించడం జరిగిందని, ఆమేరకు మండలంలో పింఛన్లు మంజూరయ్యాయని ఎంఎల్‌ఎ మానుగుంట మహీధర్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయ ఆవరణంలో నూతన పింఛన్ల పంపీణీ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లింగసముద్రం మండలంలో 228 నూతన పింఛన్లు మంజూరయ్యాయని, గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ప్రభుత్వం సంక్షేమా పథకాలను అందిస్తుందన్నారు. అనంతరం సచివాలయాల వారిగా పింఛన్లు పంపిణీ చేశారు.
ఖాళీ కవర్లు ఇవ్వడంతో ఎంఎల్‌ఎ ఆగ్రహం
పింఛన్‌ నగదు లేకుండా ఖాళీ కవర్లు లబ్ధిదారులకు ఇవ్వడంతో ఎంఎల్‌ఎ మహీధర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. లింగసముద్రం సచివాలయం పరిధిలో మంజూరైన పింఛన్లు అందజేశారు.కవరుల్లో నగదు లేకపోవడంతో పింఛన్‌ తీసుకున్న మహిళ ఎంఎల్‌ఎకు చెప్పడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఖాళీ కవర్లు ఇవ్వడానికి వచ్చామా.. అని సచివాలయ సిబ్బందిని మందలించారు. పింఛన్‌ డబ్బుల వాలంటీర్ల దగ్గర ఉన్నాయని మళ్లి ఇస్తామని చెప్పగా ఖాళీ కవర్లు ఇవ్వడం ముందు ఆపేసి వెంటనే కవర్లలో నగదు పెట్టి ఇవ్వాలని ఆదేశించారు. ఎంపిపి పెన్నా కృష్ణయ్య,ఎఎంసి వైస్‌ చైర్మన్‌ మేకనబోయిన శ్రీనివాసులు,తహశీల్ధార్‌ సుధాకర్‌,ఎంపిడిఒ చంద్రసేన్‌,మండల కన్వీనర్‌ పిచ్చపాటి తిరుపతిరెడ్డి,మండల వైసిపి అధికార ప్రతినిధి వరికూటి క్రిష్ణారెడ్డి,సర్పంచ్‌లు,ఎంపిటిసిలు పాల్గొన్నారు.