అర్హులందరికీ పింఛన్
ప్రజాశక్తి-బిట్రగుంట : అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ అందేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. బోగోలు మండలం జక్కపల్లి గూడూరు పంచాయతీలో గ్రామంలో ఆదివారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదవాడి కోసం రైతుల కోసం పనిచేస్తుందని, పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు, ఇళ్లు అందిస్తున్నారని, కొంతమందికి పెన్షన్లు తీసేస్తారనే అసత్యాలను ఎవరూ నమ్మవద్దని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ అందుతుందన్నారు. కార్యక్రమంలో గోవిందరావు, సర్పంచ్ బండ్ల సురేష్‌గౌడ్, వైసిపి మండల కన్వీనర్ మద్దిబోయిన వీర రఘు, వైసిపి నేతలు పెంచలయ్య, మాచర్ల, మల్లరెడ్డి, సుందర్ రాజ్, గండూరి శ్రీను, మేకల శ్రీను, నాయకులు తదితరులు పాల్గొన్నారు.










