వాల్మీకిపురం : అర్హులందరికీ పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందించాలన్నదే సిఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి లక్ష్యమని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని ఆరమడక, మూగలమర్రి గ్రామాల్లో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతల మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చే సమస్యలను అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో ఎంపిడిఒ షబ్బీర్ అహ్మద్, సర్పంచ్ భాస్కర్, నాయకులు యోగి, మాధవరెడ్డి, నీళ్లభాస్కర్, సురేష్ రెడ్డి, శివారెడ్డి, రాయుడు, ఆనంద పాల్గొన్నారు. రాయచోటి టౌన్ : ప్రతి గడపను సందర్శించి ప్రజల సమస్యలను పరిష్కరించడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. సంబేపల్లె మండలం శెట్టిపల్లెలో గడప గడపకూ మన ప్రభుత్వంను నిర్వాహించి ప్రతి పల్లెకు, ప్రతి గడపకు వెళ్లి ప్రజలతో మాట్లాడారు. గ్రామంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందడం సంతోషంగా ఉందన్నారు. వెనుకబడిన బిడికిలలోనూ, దళిత వాడలలోనూ సిమెంట్ రోడ్లు నిర్మాణాలు చాలా వరకు చేపట్టామని తెలిపారు. రెడ్డిమల్లువాండ్లపల్లెలోని ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రంలోని పిల్లలతో శ్రీకాంత్‌రెడ్డి మమేకమై రాగి జావతాగారు.










