Mar 25,2023 21:49

ఐసిడిఎస్‌ అధికారిణులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ బసంత్‌కుమార్‌

           పుట్టపర్తి రూరల్‌ : అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం పథకాలను అర్హులైన లబ్ధిదారులందరికీ అందించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ బసంత్‌కుమార్‌ సూచించారు. శనివారం స్థానిక జిల్లా, శిశు సంక్షేమ సాధికారిత కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా ఐసిడిఎస్‌ అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ పథకంలో భాగంగా బాలామృతం, గుడ్లు, పాలు, వైఎస్‌ఆర్‌ కిట్లు, లబ్ధిదారులకు సరిగా అందుతున్నాయా.. లేదా.. అని వి షయం క్షుణ్ణంగా ఉన్నతాధికారులకు తెలపాలన్నారు. ముఖ్యంగా విద్యా ర్థుల, ఎత్తు బరువు ఎప్పటికప్పుడు నమోదు చేసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చే సేందుకు ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షణ చేయాలని సూచిం చారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్‌ సిడిపిఒలు శాంత, లక్ష్మి, రెడ్డి రమణ మ్మ, అనురాధ, సూపర్‌వైజర్లు, ప్రాజెక్టు బ్లాక్‌ కో ఆర్డినేటర్లు, ఐసిడిఎస్‌ పీడీ కార్యాలయ సూపర్‌వైజర్‌ ఉమామహేశ్వర్‌రావు పాల్గొన్నారు.