May 11,2023 22:49

ప్రజాశక్తి-మైలవరం : అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు,ఇల్లు మంజూరు చేస్తున్నట్లు స్థానిక శాసనసభ్యు లు వసంత కష్ణ ప్రసాద్‌ పేర్కొన్నారు.జి కొండూరులో గురువారం వైయస్సార్‌ జగన్‌ అన్న కాలనీలో పేదల ఇళ్ల నిర్మాణాలకు జిల్లా కలెక్టర్‌ ఢిల్లీ రావుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇల్ల నిర్మాణాలు పూర్తయ్య కొద్దీ పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు.సొంతిల్లు లేక అద్దె ఇంట్లో నివాసం ఉంటూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొం టున్న ఎంతోమంది సొంత ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. అభివృద్ధికి,పేదల ఆత్మగౌరవానికి సూచికలుగా జగనన్న కాలనీలో నిలుస్తున్నాయన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.