Aug 01,2022 23:09

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (కృష్ణా)
విడుదలకు అర్హులైన విచారణ ఖైదీలకు సత్వరమే న్యాయ సహాయం అందించి వారికి విముక్తి కల్పించేందుకుగాను విచారణ ఖైదీల సమీక్షా కమిటీ సమావేశం నిర్వహించినట్లు మొదటి అడిషనల్‌ జడ్జి చిన్నంశెట్టి రాజు పేర్కొన్నారు.సోమవారం మచిలీపట్నం లోని జిల్లా కోర్టు ప్రాంగణంలోని జిల్లా న్యాయసేవాధికార సంస్థ మందిరంలో జిల్లా స్థాయి అండర్‌ ట్రయల్‌ రివ్యూ కమిటీ సమావేశం మొదటి అడిషనల్‌ జడ్జి అధ్యక్షతన జరిగింది. జాతీయ న్యాయ సేవాధికార సంస్థల ఉత్తర్వులను అనుసరించి విచారణ ఖైదీల విడుదలకు త్వరితగతిన చర్యలు తీసుకొనే విషయమై కమిటీ సభ్యులు చర్చించారు. భారతదేశంకు స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాల వేడుకలో భాగంగా ' ఆజాదికా అమత్‌ మహౌత్సవ్‌ ' కార్యక్రమం జరుపుకొంటున్న నేపథ్యంలో పలు జైళ్లలో న్యాయ సహకారం కోసం ఎదురుచూస్తోన్న అండర్‌ట్రయల్‌ ఖైదీల విడుదలకు తగిన అవకాశాలు పరిశీలించి వారిని త్వరితగతిన విముక్తి కల్పించే చర్యలు చేపట్టాలని ఉన్నత న్యాయస్థానాలు సూచిస్తున్నట్లు మొదటి అడిషనల్‌ జడ్జి చిన్నంశెట్టి రాజు తెలిపారు. ఉమ్మడి కష్ణాజిల్లా లో మొత్తం 273 మంది అండర్‌ ట్రయల్‌ ఖ్కెదీలు ఉన్నట్లు ఆయన తెలిపారు. .ఈ సమావేశంలో కమిటీ సభ్యులు కష్ణా జిల్లా కలెక్టర్‌ పి రంజిత్‌ బాషా, అడిషనల్‌ ఎస్పీ ఎన్‌. వెంకట రామాంజ నేయులు, ఎన్టీఆర్‌ జిల్లా డిఆర్‌ఓ మోహనరావు, ఏలూరు జిల్లా సబ్‌ కలెక్టర్‌ రాజ్యలక్ష్మి, విజయవాడ అడిష నల్‌ డిసిపి పి. వెంకటరత్నం, పలువురు డి ఎస్పీలు , డిఎల్‌ఎస్‌ఏ ఇంచార్జీ సెక్రటరి కె. అరుణ తదితరులు పాల్గొన్నారు.