ఫొటో : ఆర్‌డిఒను సన్మానిస్తున్న ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్
ఆర్‌డిఒకు ఎంఎల్‌ఎ సన్మానం
ప్రజాశక్తి-కావలి : ప్రతి అంబేద్కర్ జయంతి రోజున రక్తదానం చేస్తూ యువతకు స్ఫూర్తిగా నిలిచిన కావలి ఆర్‌డిఒ వికె.శీనా నాయక్‌ను సోమవారం ఆర్.డి.ఒ. కార్యాలయంలో సంయుక్త సేవాసంస్థ ఆధ్వర్యంలో ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డి ఘనంగా సన్మానించి మెమోంటో అందజేశారు. కార్యక్రమంలో జిల్లా రెడ్‌క్రాస్ చైర్మన్ దామిశెట్టి సుధీర్ నాయుడు, మాజీ కౌన్సిలర్ గంధం ప్రసన్నాంజనేయులు, సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ రామిరెడ్డి మాట్లాడుతూ ప్రతి అంబేద్కర్ జయంతి రోజున రక్తదానం చేసి, యువతకు స్ఫూర్తినిస్తున్న కావలి ఆర్‌డిఒ వికె శీనానాయక్‌ని అభినందించారు.










