Jan 27,2023 21:35

ఫొటో : ఆర్‌డిఒకు సత్కారం చేస్తున్న దృశ్యం

ఆర్‌డిఒ, తహశీల్దార్లకు సత్కారం
ప్రజాశక్తి-కావలి : రిపబ్లిక్‌ డే సందర్బంగా నెల్లూరు జిల్లా కలెక్టర్‌ ద్వారా ప్రశాంసా పత్రాలను పొందిన కావలి రెవెన్యూ డివిజన్‌ అధికారి వికె శీనానాయక్‌, తహశీల్దార్‌ కె మాధవరెడ్డిలను శుక్రవారం దళిత ప్రజా సంఘాల నేతలు శుక్రవారం కలసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మానవ హక్కుల నేత దాసరి బాలకృష్ణ మాట్లాడుతూ ఆర్‌డిఒ, తహశీల్దార్‌లు విధినిర్వహణలో అత్యంత ప్రతిభ కనపరచడంతో పాటు తమ దృష్టికి తీసుకువచ్చిన పేద, దళిత సమస్యలకు వెంటనే పరిష్కారం చూపేవారన్నారు.
అంతేకాక స్వచ్ఛంద సంస్థలకు సహకారం అందించేవారని తెలిపారు. వారు చేపట్టే సంక్షేమ కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్‌విడి ఎస్‌ వెంకటేశ్వర్లు, రెడ్‌క్రాస్‌ రవిప్రకాష్‌, కెన్‌ బాలు, అంబేద్కర్‌ యువజన సంఘాల సమాఖ్య నేతలు వివి రమణయ్య, తదితరులు పాల్గొన్నారు.