Apr 04,2023 21:55

ఫొటో : భూమిని పరిశీలించిన ఆర్‌డిఒ కరుణకుమారి

ఆర్‌డిఒ ఆధ్వర్యంలో భూ పరిశీలన
ప్రజాశక్తి-ఉదయగిరి : పాఠశాల నిర్మాణం కోసం వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు దరఖాస్తు చేసుకున్న భూమిని ఆత్మకూరు ఆర్‌డిఒ కరుణ కుమారి భూ పరిశీలన చేశారు. మంగళవారం స్థానిక గండిపాలెం రోడ్డు సమీపంలోని సర్వేనెంబర్‌ 514/2 ఎక్కడ భూమి కోసం గాజులపల్లి భాస్కర్‌రెడ్డి దరఖాస్తు చేసుకోవడంపై అందులో భాగంగా ఈ గ్రూప్‌ పరిశీలన చేసినట్లు ఆమె తెలిపారు.
ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న స్థలాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ సానా శ్రీనివాసులు రెడ్డి, విఆర్‌ఒలు వెంకటరమణ, అనూష, సర్వేయర్లు రవి, మీరావలి, తదితరులు పాల్గొన్నారు.