ఆర్డీవో రవిశంకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ
ప్రజాశక్తి-శ్రీకాళహస్తి
శ్రీకాళహస్తి ఆర్డీవోగా ఎన్.రవిశంకర్ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. శ్రీకాళహస్తి ఆర్డీవోగా పని చేస్తున్న కేఎస్ రామారావును విజయవాడ కనకదుర్గ ఆలయ కార్య నిర్వహణాధికారిగా బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో కడప భూ సేకరణ విభాగం స్పెషల్ కలెక్టరు వద్ద పీఏగా విధులు నిర్వహిస్తున్న ఎన్. రవిశంకర్ రెడ్డిని శ్రీకాళహస్తి ఆర్డీవోగా నియమిస్తూ ఈ నెల 19వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తరువాత వరుస సెలవులు రావడంతో రవిశంకర్ రెడ్డి బాధ్యతలు తీసుకోవడానికి ఆలస్యం జరిగింది. ఆర్డీవోగా బాధ్యతలు తీసుకున్న రవిశంకర్ రెడ్డిని డివిజను పరిధిలోని తహసీల్దార్లు, రెవిన్యూ ఉద్యోగులు మర్యాద పూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలిపారు.
ఆర్డీవో రవిశంకర్‌రెడ్డి










