ఫొటో : రికార్డులు పరిశీలిస్తున్న అధికారులు
ఆర్‌బికెలో తనిఖీలు
ప్రజాశక్తి-సంగం : సచివాలయంలోని రైతు భరోసా కేంద్రంలో విజిలెన్స్ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. విజిలెన్స్ అధికారులు అవినాష్ రెడ్డి, వెంకట రమణ రైతు భరోసా కేంద్రంలో రికార్డులు పరిశీలించి, ఈ క్రాప్ నమోదు, తదితర అంశాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఎరువులు పంపిణీకి సంబంధించిన రికార్డులు తనిఖీ చేశారు. విజిలెన్స్ డిజి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాలను తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు.










