Jul 11,2021 15:26

దేశ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా ఎన్ని ఎదురుచూస్తున్న భారీ సినిమా ''ఆర్‌ఆర్‌ఆర్‌.'' 'బాహుబలి' సినిమాతో తెలుగు సినిమా సత్తాను ఎల్లలు దాటించిన రాజమౌళి.. మళ్ళీ అదే రేంజ్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ రూపొందిస్తున్నారు. ఇప్పటికే 80 శాతం పైగా షూటింగ్‌ పూర్తి చేసుకుంది. హై వోల్టేజ్‌ యాక్షన్‌ సీన్స్‌, ఎమోషన్స్‌ కలగలుపుతూ నందమూరి, మెగా ఫ్యాన్స్‌ ఉర్రూతలూగేలా ప్లాన్‌ చేసిన జక్కన్న.. ఈ సినిమా నుంచి మరో సర్‌ప్రైజ్‌ రెడీ చేశారు. ఈ మేరకు తాజాగా దీనిపై అఫీషియల్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. ఈ నెల 15వ తేదీ ఉదయం 11 గంటలకు 'రోర్‌ ఆఫ్‌ ఆర్‌ఆర్‌ఆర్‌' పేరుతో మేకింగ్‌ వీడియోను రిలీజ్‌ చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఇద్దరు హీరోలకు సంబంధించిన కొన్ని మేకింగ్‌ సీన్స్‌ హైలైట్‌ కానున్నట్లు తెలుస్తోంది. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాను బడా నిర్మాత డివివి దానయ్య సమర్పణలో దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌ కేటాయించి రూపొందిస్తున్నారు. ఇప్పటికే పలుసార్లు షూటింగ్‌ వాయిదా పడటంతో సెకండ్‌ వేవ్‌ అనంతరం షూటింగ్‌ స్పీడు పెంచారు. ఎలాగైనా అతి త్వరలో షూటింగ్‌ పూర్తి చేసి.. చెప్పిన తేదీ అక్టోబర్‌ 13న సినిమాను రిలీజ్‌ చేయాలని బలంగా ఫిక్సయ్యారు. కాగా, ఈ భారీ మూవీలో ఎన్టీఆర్‌ సరసన హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరిస్‌ నటిస్తుండగా.. రామ్‌ చరణ్‌ సరసన ఆలియా భట్‌ నటిస్తోంది. అజరు దేవగణ్‌, శ్రియ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన అన్ని అప్‌డేట్స్‌ భారీ రెస్పాన్స్‌ తెచ్చుకోవడంతో సినిమాపై ఓ రేంజ్‌ అంచనాలు నెలకొన్నాయి.