రాయచోటి : జగన్ రెడ్డి అరాచక పాలనతో రాష్ట్రం అధోగతి పాలైందని రాయచోటి నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం రాయచోటి మున్సిపాలిటీలోని 16 వార్డులో టిడిపి ఆధ్వర్యంలో మన రాష్ట్రానికి ఇదేమి కర్మ, రచ్చబండ కార్యక్రమాలను, నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన టిడిపి నాయకులు, కార్యకర్తలు కలిసి వార్డులో పర్యటిస్తూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొనసాగుతున్న అవినీతి అరాచక పాలన ప్రజా, రైతు వ్యతిరేక విధానాలపై ప్రజలకు వివరించారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రక్షణ లేకుండా పోయిందని, టిడిపి నేతలపై దాడులు, అక్రమ కేసులు ఎక్కువయ్యాయని వాపో యారు. మహిళలపై అఘాయిత్యాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి తోడు అసంఘటిత, విద్యుత్, భవన నిర్మాణ కార్మికులు, అంగన్వాడీ వర్కర్లు, ఆశా కార్యకర్తలు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు పనిభారంతో అల్లాడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా రోడ్లన్నీ గుంతల మయంగా తయార య్యాయని, మున్సిపాలిటీల్లో సిమెంటు రోడ్లు అధ్వానంగా ఉన్నాయని చెప్పారు. ఏడాది కందట వచ్చిన వరదల్లో అన్నమయ్య, పింఛ ప్రాజెక్టులు తెగిపోతే సంవత్సరం గడుస్తున్నా ఇప్పటికీ వాటి గురించి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్ర వ్యవస్థ గాడిన పడాలంటే రాబోయే 2024 ఎన్నికల్లో తప్పనిసరిగా చంద్రబాబు సీఎం కావాలని పేర్కొన్నారు. కార్యక్ర మంలో పట్టణ అధ్యక్షులు బోనమాల ఖాదర్‌వలి ,రూరల్ అధ్యక్షులు మురికినాటి వెంకటసుబ్బారెడ్డి, రాజంపేట పార్లమెంటు టిడిపి అధికార ప్రతినిధి వతన్ నిస్సార్, ఆసుపత్రి అభివద్ధి కమిటీ మాజీ చైర్మన్ ఎస్.కె హుస్సేన్, పట్టణ మైనార్టీ అధ్యక్షులు అతావుల్లా, టిడిపి నేతలు మైనుద్దీన్, మాజీ కౌన్సిలర్ మహబూబ్‌బాష , పట్టణ తెలుగు యువత అధ్యక్షులు ఇనముల్లా ,అత్తర్ జావిద్, శేషి జాబీర్, సోనిరాజ్ కలీమ్, ఇలియాజ్, సర్దార్ వలి ఖాన్ , సయ్యద్ ఫజిల్ , జావిద్ , ఉమర్ ఫరూక్ , జిలాన్ బాష, బసయ్య, మహబూబ్ బాష, హాజీ, మన్సూర్, మతీన్, శివారెడ్డి, దుర్గ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










