పుట్టపర్తిలో మాట్లాడుతున్న పల్లె రఘునాథరెడ్డిపుట్టపర్తి అర్బన్ : రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న వైసీపీ పాలనకు చమర గీతం పాడే సమయం ఆసన్నమైందని మాజీ మంత్రి, టిడిపి పుట్టపర్తి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. గురువారం నగర పంచాయతీలోని కర్ణాటక నాగేపల్లిలో నిర్వహించిన ఇదేమి కర్మ మన రాష్ట్రానికి ఈనే కార్యక్రమంలో పాల్గొన్న పల్లె మాట్లాడారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని అన్నారు. గట్టిగా నిలదీసిన నాయకులను పోలీసుల ద్వారా అరెస్టు చేస్తున్నారన్నారు. మూడున్నర ఏళ్ల పాలనలో ప్రభుత్వ పాలన చూస్తూ ఇదేమి కర్మ మన రాష్ట్రానికి అంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ అరాచక దౌర్జన్య పాలన పట్ల ప్రజలు విసిగిపోయారని 2024 ఎన్నికలలో తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ కన్వీనర్ రామాంజనేయులు, పార్లమెంటు పార్టీ కార్యదర్శి సామకోటి ఆదినారాయణ, మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ రత్నప్ప చౌదరి, అంబులెన్స్ రమేష్, మాల మనోహర్, కరణం సుబ్రహ్మణ్యం, రాజప్ప, శ్రీరాములు, రమేష్, తెలుగు మహిళా నాయకురాలు మాధవి తదితరులు పాల్గొన్నారు.
ధర్మవరం టౌన్ : వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో అసహనం పెరిగిందని 19వ వార్డు టీడీపీ ఇన్‌చార్జి చంద్రకళ అన్నారు. గురువారం స్థానిక 19వ వార్డులో వార్డు ఇన్‌ఛార్జి ఆధ్వర్యంలో బాలయ్య అభిమానులు ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. వైసిపి దోచుకోవడం దాచుకోవడమే పనిగా పెట్టుకుందన్నారు.
కదిరి టౌన్ : వైసిపి పాలనలో ప్రగల్బాలు తప్ప అభివృద్ధి శూన్యమని టిడిపి నాయకులు మోపురిశెట్టి చంద్రశేఖర్, పట్టణాధ్యక్షుడు డైమండ్ ఇర్ఫాన్ విమర్శించారు. ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమాన్నిరూరల్ మండలం సున్నపుగుట్ట తండా, పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్ 11 వ వార్డులో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కదిరి పట్టణ అధ్యక్షుడు డైమండ్ ఇర్ఫాన్ ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు రాజశేఖర్ బాబు మాట్లాడుతూ వైపిపి ప్రభుత్వం ప్రజా సమస్యలు పట్టించుకోవటం లేదని విమర్శించారు.ఈ కార్యక్రమంలో నాయకులు చెన్నకేశవులు, మహేంద్ర, విశ్వనాథ్, ప్రకాష్, చాంద్‌భాషా, ఖాదర్‌బాషా, కతాబలి ఖాన్, సులేమాన్, సిరాజ్, గంగరత్నమ్మ, శారద, బాజాన్, శవాజ్ తదితరులు పాల్గొన్నారు.
తలుపుల : మండలంలోని పెద్దన్నవారిపల్లి పంచాయితీ లోని మైరాడ, చిన్నన్నవారిపల్లి, కాయలపల్లి, చిన్నన్నవారిపల్లి దళిత కాలనీల్లో టిడిపి నాయకులు ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ ముబారక్, పల్లపు రామాంజనేయులు, జయచంద్ర. శ్యామ్ సుందర్ రెడ్డి, రామామంజులు తదితరులు పాల్గొన్నారు.










