ధర్మవరం టౌన్ : వైసిపి అరాచక పాలనకు రోజులు దగ్గరపడ్డాయని టిడిపి ధర్మవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్ విమర్శించారు. ఈ మేరకు ఆదివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' అనే కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను నాయకులు కార్యకర్తలతో కలిసి విడుదల చేశారు.ఈ సందర్భంగా పరిటాలశ్రీరామ్ మాట్లాడుతూ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలన్నారు. సోమవారం నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహించే ఇదేం ఖర్మ మనరాష్ట్రానికి అనే కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కమతం కాటమయ్య, ఫణికుమార్, పురుషోత్తంగౌడ్, చింతవులుసు పెద్దన్న, చింతలపల్లి మహేశ్, చారుగుండ్ల ఓబుళేశు, పరిశేసుధాకర్, భీమనేని ప్రసాద్‌నాయుడు, నాగూర్ హుస్సేన్, రాళ్లపల్లి షరీఫ్, ప్రకాశ్, గంగారపు రవి, బొటుకిష్ట, మారుతిస్వామి తదితరులు పాల్గొన్నారు.
కనగానపల్లి : తాము అధికారంలోకి వచ్చిన తరువాత పర్మినెంట్ ఉద్యోగాలు ఉంటాయని చెప్పిన సీఎం జగన్ ఇప్పుడు ఏకంగా మూడు లక్షల మంది ఉద్యోగులను తొలగిస్తున్నారని మాజీ మంత్రి పరిటాల సునీత విమర్శించారు. వారి భవిష్యత్తు కోసం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు రోడ్డెక్కి పోరాటం చేస్తే తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు. మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమంలో పరిటాల సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఆమె ఇంటింటికి వెళ్లి అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సమస్య, రైతుల ఇబ్బందుల గురించి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నెట్టెం వెంకటేష్, రామ్మూర్తినాయుడు,బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి భానుగోట నరసింహులు, సుధాకర్ చౌదరి, తెలుగు యువత అధ్యక్షులు బట్టా సురేష్ చౌదరి, నాయకులు కసుముర్తి వెంకటేష్, బిల్లే భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
చిలమత్తూరు : పార్టీకి పూర్వవైభవం తీసుకురావటానికి నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని టిడిపి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీనివాసులు, డాక్టర్ సురేంద్ర కోరారు. స్థానిక కొడికొండ చెక్‌పోస్టులోని రంగారెడ్డి పెట్రోల్ బంక్ వద్ద ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఇదేం ఖర్మ-మన రాష్ట్రానికి అంశం పై పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ రంగారెడ్డి, మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజినప్ప, నియోజకవర్గ కోఆర్డినేటర్ విశ్వనాథరెడ్డి, రాష్ట్ర ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి బేకరీ గంగాధర్, తెలుగు మహిళా పార్లమెంట్ ఉపాధ్యక్షురాలు శ్రీదేవి, కోడికొండ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.










