తాడిమర్రి:అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం పూల ఓబయ్యపల్లి గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు... పూల బయయ్యపల్లి గ్రామానికి చెందిన ఆకులేటి రామాంజనేయులు(60)కు నాలుగు ఎకరాల సొంతపొలం ఉంది. ఇందులో వర్షాధార పంటలుగా వేరుశనగ, కంది పంటలను సాగు చేశాడు. పంటల సాగు, కుటుంబ అవసరాల కోసం సుమారు రూ.5 లక్షల వరకు అప్పులు చేశాడు. గత 5 సంవత్సరాల నుంచి పంటలు చేతికి అందకపోవడంతో అప్పులు తీర్చడం కష్టం అయ్యింది. తీవ్ర మనోవేదనకు గురై సోమవారం రాత్రి ఇంట్లో సీలింగ్‌ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు గుర్తించి ఆసుపత్రికి తీసుకెళ్లేలోపు ఆయన మృతి చెందాడు. మతునికి భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.










