May 28,2022 16:13

 ప్రజాశక్తి - గంపలగూడెం: ప్రతికూలీ అప్పగించిన పని పూర్తి చేసినట్లయితే తగిన కూలీ పొందవచ్చునని గంపలగూడెం ఎంపీడీవో వై పి రెడ్డి తెలిపారు. శనివారం నాడు ఆయన మండలంలో గోసవీడు గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూలీలు రాకుండానే ఎక్కడైనా ఎప్పుడైనా హాజరు వేసినట్లయితే తమ దృష్టికి తేవాలని కోరారు. అటువంటి చర్యలు జరిగితే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు. శనివారం నాడు గోసవీడు గ్రామంలో243 మంది కూలీలు పని చేస్తున్నట్లు ఎంపీడీవో గుర్తించారు.గంపలగూడెం మండలంలో మొత్తం 24 పంచాయతీల్లో 317 గ్రూపులకు గాను శనివారం నాడు 7,325 మంది కూలీలు పని చేస్తున్నట్లు ఎంపీడీవో పి రెడ్డి  వివరించారు