Mar 20,2023 21:03

స్కానర్‌ ఉన్న దృశ్యం

స్కానర్‌ ఉన్న దృశ్యం
అపోలోలో 'డిఈఎక్స్‌ఎ స్కానింగ్‌' సేవలు
నెల్లూరు :అపోలో హాస్పిటల్‌ లో ఉమెన్స్‌ డే ని పురస్కరించుకొని డిఈఎక్స్‌ఎ స్కానింగ్‌ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చామని ఆ వైద్యశాల మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రీరాం సతీష్‌ తెలిపారు. సోమవారం అపోలో వైద్యశాల మీటింగ్‌ హాల్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తమ వైద్యశాలలో ఏర్పాటు చేసిన అత్యంత అధునాతనమైన డిఈఎక్స్‌ఏ స్కానింగ్‌ పరికరంతో పరీక్షలు చేయడం ద్వారా ఎముకలు ఏ మేరకు బలంగా ఉన్నాయో, ఎంత శాతం బలహీనపడ్డాయో గుర్తించడం సాధ్యమౌతుందన్నారు. ఈ స్కానింగ్‌ ద్వారా మహిళల్లో ఎముకల్లో కాల్షియం, ఫాస్ఫేట్‌, మినరల్స్‌, కొవ్వు శాతం తగిన మోతాదులో ఉన్నాయో లేదో గుర్తించవచ్చున్నారు
.ఈ స్కానింగ్‌ ముఖ్యంగా ఎముకల బలహీనతను తద్వారా వచ్చే సమస్యలను గుర్తు చేస్తుందన్నారు. ముఖ్యంగా మహిళల్లో మెనోపాజ్‌ సమయంలో , ఎక్కువ మోతాదులో మద్యం తీసుకునే వాళ్లకి, విటమిన్‌ డి లోపం ఉన్న వాళ్లకు, స్టెరాయిడ్స్‌ ఎక్కువ రోజులు తీసుకొన్నవాళ్లకి, ఆర్థరైటీస్‌ సమస్య ఉన్న వాళ్లకి ఈ పరికరం ద్వారా స్కానింగ్‌ ఎంతో దోహదపడుతుందన్నారు. జిల్లా ప్రజలు తక్కువ ఖర్చుతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో సిఈఓ నవీన్‌, ఆపరేషన్‌ హెడ్‌ బాలరాజు, హెచ్‌ ఓడి డాక్టర్‌ గాయత్రి, డాక్టర్‌ ప్రమేష్‌, డాక్టర్‌ షబానా, డాక్టర్‌ అర్షియా తదితరులు పాల్గొన్నారు.