కడప ప్రతినిధి : ఆప్కో పూర్వవైభవాన్ని సంతరించుకోవడం తథ్యమని ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి పేర్కొన్నారు. సోమవారం ఆయన కడప, అన్నమయ్య జిల్లాల ఎడిలు, చేనేత సహకార సంఘాల ప్రతినిధులతో ఆత్మీయ సమావేశ నిర్వ హించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డుతూ సొసైటీలు ఆర్థికాభివృద్ధిని సంతరించుకునేలా, చేనేతల ఉత్పత్తులను కొనుగోలు చేసేలా చూశామన్నారు. ఫలితంగా ఆప్కో కార్మికుల ఉపాధి, అవకాశాలను మెరుగుపరచడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. 2022 డిసెంబర్ నాటికి పాత బకాయిలన్నింటినీ క్లియర్ చేశామన్నారు. సొసైటీల నిల్వలన్నింటినీ వంద శాతం కొనుగోలు చేశామని తెలిపారు. మొదటి విడత కింద రూ.48 లక్షల స్టాకును తీసుకున్నామన్నారు. కోర్టు తీర్పు వచ్చిన నేపథ్యంలో బకాయిలను చెల్లించామని తెలిపారు. ప్రస్తుతం ఆప్కో దగ్గర రూ.50 లక్షల విలువ కలిగిన సరుకు నిల్వ ఉందన్నారు. 2013 నుంచి 2017 సంవత్సరాలకు చెందిన సరుకు అధిక శాతం డిస్కౌంట్ పెట్టా మని చెప్పారు. జూన్ నుంచి 75 శాతం డిస్కౌంట్ అమలు చేస్తామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇన్‌స్టాల్‌మెంట్స్ ఉంటామ యన్నారు. బయటి వ్యక్తులు సరైన పత్రాలను సమర్పిస్తే 12 నెలలపాటు డిస్కౌంట్ ఇచ్చే అవ కాశాలు ఉన్నా యని చెప్పారు. స్టాక్‌ను వేగంగా విక్రయించడం, టర్నోవర్‌ను పెంచుకోవాలనే లక్ష్యంతో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. సొసైటీ కార్మికులు అనారోగ్య కారణాలతో మృతి చెందితే రూ.25 వేల నుంచి పరిహారం చెల్లించే పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఉత్తరాంధ్రలో 100 మందికి చెక్కులు అందించానని తెలిపారు. రాయలసీమలో తక్కువగా ఉన్నాయని చెప్పారు. రూ.2.5 కోట్ల ఎన్‌హెచ్‌డిసి బకాయిలు చెల్లించామన్నారు. తొమ్మిదేళ్లుగా చేనేత కార్మికుల వేతనాలు పెంచలేదని, ప్రస్తుత పరిస్థితుల్లో జీవన వ్యయం పెరిగిన నేపథ్యంలో వేతనాలు పెంచామని తెలిపారు. రాష్ట్రంలోని చేనేత విక్రయశాలలను ప్రభుత్వ భవనాల్లోకి మార్చుతున్నామని తెలిపారు. ఆప్కో ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. మంగళగిరిలోని 3.5 ఎకరాల చేనేత స్థల ప్రహరీ నిర్మాణానికి టెండర్లు పిలిచామన్నారు. చేనేత రంగానికి విశేష కృషి చేసిన మహనీయులు విగ్రహాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. జులై నుంచి సేల్స్‌మెన్ వేతనాలను పెరుగుతాయని చెప్పారు. నేత న్ననేస్తం కింద అందించే రూ.24 వేలతోరా మెటీరియల్ కొనుగోలు చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో కడప, అన్నమయ్య ఎడిలు భీమయ్య, శ్రీనివాసరెడ్డి, ఎడిఓలు శేషగిరి, రవి, అహ్మద్, కిరణ్‌కుమారి, వనిత, డిఒలు కృష్ణ, ఆప్కో డైరెక్టర్ ఉదయగిరి వెంకటేష్, సొసైటీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.










