Jul 13,2021 18:29

ఢిల్లీ : ఆప్‌ కి మద్దతుగా నవ్‌ జోత్‌ సిద్ధూ ట్వీట్‌ చేశారు. తన పనిని ఆప్‌ ఎప్పుడూ గుర్తిస్తుందని తన ట్వీట్‌ లో పేర్కొన్నారు. పంజాబ్‌ కోసం ఎవరు పోరాడుతున్నారో దీని ద్వారా తెలిసిపోతుందని పేర్కొన్నారు. డ్రగ్స్‌, రైతుల అంశంతో పాటు అవినీతి, విద్యుత్‌ సంక్షోభం వంటి అంశాలపై ప్రశ్నలు లేవనెత్తారని తెలిపారు. అయితే సిద్ధూ ట్వీట్‌ పై కాంగ్రెస్‌ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.