అమరావతి : ఎపిలో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 91,594 కరోనా నమూనాలను పరీక్షించగా.. 2,672 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 19,37,122 మంది వైరస్ బారినపడ్డారు. గడిచిన 24 గంటల వ్యవధిలో కరోనా వల్ల 18 మంది మృతిచెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మృతుల సంఖ్య 13,115కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 2,467 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 18,98,966కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వివరాలు వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 25,041 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,34,88,031 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.










