Oct 13,2023 15:35
  •  సీనియర్ సైకియాట్రిస్ట్ డాక్టర్ ఎన్.వి.రమణారావు 

ప్రజాశక్తి-గుంటూరు : ప్రస్తుత సమాజంలో కారణాలు ఏవైనా మానసిక వ్యాధులు బాగా పెరిగిపోతున్నాయని సీనియర్ సైకియాట్రిస్ట్ డాక్టర్ ఎన్ .వి.రమణారావు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం స్థానిక శ్రీ కన్వెన్షన్ సెంటర్లో ఇండియన్ సైకియాట్రి సొసైటీ సౌత్ జోన్ నిర్వహించిన తొలి రోజు నిరంతర  వైద్యవిద్యా కార్యక్రమం (సిఎంఈ )ని డాక్టర్ రమణారావు జ్యోతి వెలిగించి ప్రారంభించి, ప్రసంగించారు. ఐపీఎస్ సౌత్ జోన్ అధ్యక్షులు డాక్టర్ కే ఉదయ్ కుమార్ కార్యక్రమాలనికి సారద్యం వహించారు. డాక్టర్ రమణారావు ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ తగ్గిపోవడం, చిన్న వయసులోనే స్వతంత్రత పెరిగిపోవడం జీవితంలో ఎదురయ్యే సమస్యలు ఎదుర్కొనే అనుభవాలు లేకపోవడం, నేటి యువత ప్రతి చిన్న సమస్యను ...పెద్ద సమస్యగా చూడడం, తట్టుకునే శక్తి లేకపోవడం, సమాజంలో వచ్చిన శాస్త్ర, సాంకేతిక, జీవన మార్పులు మానసిక స్థితిపై ఎంతో ప్రభావం చూపుతున్నాయన్నారు. నేటి విద్యా విధానం, తల్లిదండ్రులకు పిల్లల పట్ల గల ఆశయాలు, ఆకాంక్షలు పాఠశాల పిల్లల్లో సైతం మానసిక రుగ్మతలకు కారణమవుతున్నాయి అన్నారు.