Dec 21,2022 22:44

అధికారితో మాట్లాడుతున్న నాయకులు

పుట్టపర్తి అర్బన్‌ : పట్టణంలో కర్ణాటక నాకేపల్లి రహదారిలో ప్రతి శనివారం నిర్వహించే వారపు సంతను అనువైన చోట ఏర్పాటు చేయాలని టిడిపి నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు టిడిపి జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ ఆధ్వర్యంలో నాయకులు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటరామిరెడ్డికి బుధవారం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంతను రోడ్డుకు ఇరువైపులా నిర్వహిస్తుడటంతో వ్యాపారులకు, వినియోగదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. కదిరి, బుక్కపట్నంకు వెళ్లే బస్సులు, వాహనాలు వెళుతుండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ప్రజల సౌకర్యం ఈ వారపు సంతను మరొక ప్రదేశంలో ఏర్పాటు చేయాలని కమిషనర్‌ ను కోరారు. ఈ సమావేశంలో పార్లమెంటు రైతు సంఘం ప్రతినిధి అమ్మినేని కేశవ నాయుడు, ఆరవ వార్డు ఇన్‌ఛార్జి బేకరీ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.