Jan 05,2023 19:24

గొల్లపల్లి వద్ద మృతి చెందిన నెమలి

ప్రజాశక్తి-వాల్మీకిపురం: అనుమానాస్పద స్థితిలో నెమలి మృతి చెందిన సంఘటన గురువారం పట్టణంలో చోటు చేసుకొంది. గొర్రెల కాపరుల సమాచారం మేరకు.. పట్టణ సమీపంలోని గొళ్లపల్లి రోడ్డులోని అటవీ ప్రాంతంలో నెమళ్లు సంచరిస్తుంటాయి. పలుమార్లు రోడ్లపైకి కూడా వస్తుండడంతో చుట్టుప్రక్కల పొలాల రైతులు అటవీ ప్రాంతాల్లోకి తరిమేసేవారు. గుర్తు తెలియని వేటగాళ్లు నెమళ్లపై దాడులు చేయడంతో ఓ నమెలి మృతి చెందినట్లు పలువురు చర్చించుకుంటున్నారు. అటువైపుగా వెళ్తున్న గొర్రెల కాపరులను చూసి దుండగులు పరారైనట్లు తెలిపారు. అటవీశాఖ అధికారులు నిద్రమత్తులో జోగుతుండడంతో నెమళ్లపై దాడులు జరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు నెమళ్లపై దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.