వినతిపత్రం అందజేస్తున్న దృశ్యం
అనర్హులైన ఓట్ల తొలగింపునకు చర్యలు చేపట్టాలి
నెల్లూరు :ఎంఎల్‌సి ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం ఇటీవల రూపొందించిన ఓటర్ల జాబితాలో అనర్హులైన వారిని తొలగించేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టాలని సిపిఎం, సిపిఐ జిల్లా కమిటీలు డిఆర్‌ఓ నారాయణమ్మకు వినతిపత్రం అందజేశాయి. శనివారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన అఖిల పక్ష రాజకీయ పార్టీల సమావేశంలో ఎన్నికల కమిటీ కన్వీనర్ ఎం.మోహన్‌రావు మాట్లాడుతూ
డ్రాఫ్ట్ లిస్టులోని అనర్హులైన ఓట్లపై అభ్యంతరాలను రాతపూర్వకంగా అధికారులకు తెలియజేశామన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన తుది జాబితా పరిశీలిస్తే అనర్హులను ఓటర్ల జాబితా నుంచి తొలగించలేదన్నారు. ఉపాధ్యాయ ఎంఎల్‌సి ఓట్ల నమోదులో అధికార పార్టీ అనేక అక్రమాలకు పాల్పడిందని, రెండవ విడతలో సైతం అనర్హులైన అనేకమందిని ఓటర్లుగా నమోదు చేశారన్నారు. జిల్లా అధికారులు వెరిఫికేషన్ చేపట్టి అనర్హులైన ఓట్ల తొలగింపుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ సంఘాల సమన్వయ కమిటీ కన్వీనర్ ఆర్ .నగేష్ ,సిపిఐ జిల్లా కమిటీ సభ్యులు సిరాజ్ వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు .










