నివాళులర్పిస్తున్న నాయకులు
అన్నపరెడ్డి వెంకటేశ్వర్లకు ఘన నివాళి
నెల్లూరు:21వ డివిజన్ సిపిఎం నాయకుడు అన్నపరెడ్డి వెంకటేశ్వర్లు రెండో వర్ధంతి సందర్భంగా ఉమా రెడ్డి గుంట సెంటర్ నందు మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేసి స్థూపం వద్ద వారికి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాదాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అన్నపురెడ్డి వెంకటేశ్వర్లు పార్టీ క్రియాశీలక కార్యకర్తగా ఉంటూ ,ఉమా రెడ్డి గుంట ప్రాంతంలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని ప్రజలను ఐక్యం చేసే దాంట్లో క్రియాశీలకంగా పనిచేశారన్నారు. అటువంటి కార్యకర్తను కోల్పోవడం మన పార్టీకి తీరని లోటు అని అన్నారు. వారి ఆశయ సాధన కోసం పనిచేయడమే మనం వారికి ఇచ్చే ఘన నివాళి అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రూరల్ కార్యదర్శి వర్గ సభ్యులు కిన్నెర కుమార్, కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు ఎన్ రఘురామయ్య ,సిపిఎం రూరల్ కమిటీ సభ్యులు దేవతాటీ సంపత్ కుమార్ , కండే కోటేశ్వరరావు , సిపిఎం శాఖ కార్యదర్శి పోతురాజు శ్రీనివాసులు, నల్లగొండలో రమణయ్య, ఎస్.కె కాలేశా , డివైఎఫ్‌ఐ నాయకులు డబ్బు గుంట శ్రీనివాసులు , ఆటో కార్మిక సంఘం నాయకులు మణి, ముని, పార్టీ సభ్యులు స్థానిక పార్టీ సానుభూతిపరులు పాల్గొన్నారు.
4చెత్త వేసిన ప్రదేశాన్ని పరిశీలిస్తున్న కమిషనర్










