అన్నం పెట్టే రైతు
దండం పెడుతున్నాడు
దళారులను
పిండం పెట్టొద్దని
ఏరువాక కోసం
ఎదురు చూపు
ఈ సారైనా
పట్టెడన్నం పెట్టమని
దిన దిన గండం
నూరేళ్ళు ఆయుష్షు
రైతు మోములో
ఎప్పుడు ఉషస్సు ?
రైతు కన్నీరు ఆవిరై
ఎదురు చూపు
మేఘాలుగా
వర్షిస్తాయేమోనని
వానపాటకు
మేఘాలు ఆనవాలు
రైతు బ్రతుకు బాటకు
కన్నీరు చేవ్రాలు
ప్రకృతి వికృతి ఐతే
పైరు ఎండె
అది చూసి
ఆగె రైతు గుండె.
కయ్యూరు బాలసుబ్రమణ్యం
సెల్ : 77802 77240










